తిరుపతిలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ... సినీ నటి అక్కినేని సమంత తన వంతు సాయం అందించారు. ఆమె నిర్వహించే ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ ద్వారా, ఇతర సంస్థల ప్రతినిధులతో కలసి నాలుగు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తిరుపతికి పంపించారు. తిరుచానూరులోని పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్లో వాటిని ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ ప్రతినిధులు.. అధికారులకు అందజేశారు.
తిరుపతిలోని కొవిడ్ కేర్ సెంటర్కు సినీనటి సమంత సాయం - సమంత ప్రత్యూష ఫౌండేషన్ వార్తలు
సినీ నటి సమంత తన ఉదారతను చాటుకున్నారు. ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ ద్వారా తిరుపతిలోని కొవిడ్ సెంటర్కు 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు.
ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్