శ్రీవారి లడ్డు ప్రసాద విక్రయకేంద్రాల వద్ద భక్తుల బారులు
తితిదే అనుబంధ కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాల విక్రయం - tirumala laddu news
సబ్సిడీ ధరలపై తిరుమల శ్రీవారి లడ్డూలను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది తితిదే. దాదాపు రెండు నెలలుగా శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతించకపోవడంతో పాటు... తితిదే తిరుమల శ్రీవారి ప్రసాదాలను విక్రయిస్తోంది. గతంలో 50 రూపాయలకు అమ్మిన చిన్న లడ్డూ రూ. 25కు, 200ల పెద్ద లడ్డూ 100కు తగ్గించి భక్తులకు విక్రయిస్తోంది. 22 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తితిదే కల్యాణమండపం, సమాచార కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాల విక్రయం చేపట్టారు. సుదీర్ఘకాలం తర్వాత స్వామివారి ప్రసాదం అందుబాటులోకి రావడంతో.. భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతిలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద విక్రయకేంద్రాల వద్ద తాజా పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి నారాయణప్ప వివరాలు అందిస్తారు.
![తితిదే అనుబంధ కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాల విక్రయం Sale of Laddu Prasadas at Ttd subsidiaries throughout the state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7301020-896-7301020-1590132311660.jpg)
తిరుమల సబ్సిడీ లడ్డు