ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

tirumala: కరోనా టీకా వేసుకోని తితిదే సిబ్బందికి జీతాలు నిలుపుదల! - తితిదే సిబ్బందికి వ్యాక్సినేషన్

కరోనా టీకా వేసుకోని తితిదే సిబ్బందికి జీతాలు నిలుపుదల చేయాలని తితిదే ఈవో జవహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఇవ్వాలని నోట్​లో పొందుపర్చారు.

salaries stop  to ttd staff who have not been vaccinated
కరోనా టీకా వేసుకోని తితిదే సిబ్బందికి జీతాలు నిలుపుదల

By

Published : Jul 1, 2021, 12:52 PM IST

కరోనా టీకా వేసుకోని తితిదే సిబ్బందికి జీతాలు నిలుపుదల చేయాలని తితిదే ఈవో జవహర్‌ రెడ్డి (TTD EO Jawahar reddy) ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్​ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని పలుమార్లు సూచించినా కొందరు నిర్లక్ష్యం చేశారని.. అటువంటి వారికి జూన్ నెల జీతాలు ఆపాలని అన్ని విభాగాల హెవోడీలకు ఆయన నోట్ పంపించారు.

ఫ్రంట్ లైన్ సిబ్బందితోపాటు, 45 ఏళ్లకు పైన ఉన్న వాళ్లు వ్యాక్సిన్ వేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఇవ్వాలని నోట్​లో పొందుపరిచారు. టీకా వేసుకున్నట్లు నిర్ధారించిన తర్వాత... మళ్లీ సప్లిమెంటరీ బిల్లులను 8న పంపించాలని స్పష్టం చేశారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బంది బిల్లులను మాత్రం వెంటనే చెల్లించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details