ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యాటకులతో సందడిగా మారిన సదాశివ రిజర్వాయర్ - The bustle of tourists at the reservoirs news

ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాల కారణంగా జలశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు నిండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ జలకళ అందాలు చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.

Sadasiva Reservoir
పర్యాటకులతో సందడిగా మారిన సదాశివ రిజర్వాయర్

By

Published : Dec 20, 2020, 9:20 PM IST

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని సదాశివ రిజర్వాయర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో సందర్శకులు జలాశయం వద్దకు చేరుకున్నారు. అటవీ ప్రాంతంలోని కొండల్లో నుంచి రిజర్వాయర్​కు నీరు చేరుతోంది. పూర్తిస్థాయిలో నిండిన జలాశయం నుంచి అలుగు ప్రవాహిస్తుండటంతో.. నీటిలో దిగి కేరింతలు కొడుతూ పర్యాటకులు సేద తీరారు. భారీగా వచ్చిన సందర్శకులతో ఆ ప్రాంతం అంతా రద్దీగా మారింది.

ABOUT THE AUTHOR

...view details