చైనా దొంగ దెబ్బతో వీరమరణం పొందిన భారత జవాన్లకు శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. భారత్‌పై తెగబడిన డ్రాగన్‌కు బుద్ధి చెప్పే దిశగా భారతీయులు అడుగులు వేయాలన్నారు. చైనా వస్తువులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాప్ మాజీ ఛైర్మన్ డిమాండ్ చేశారు.
మృతి చెందిన వీర జవాన్లకు శాప్ మాజీ ఛైర్మన్ నివాళి - news on india soldiers' deaths in chittore
చైనా దాడిలో మృతి చెందిన వీర జవాన్లకు శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ నివాళులర్పించారు. దేశంపై విరుచుకుపడిన చైనాకు తగిన బుద్ధి చెప్పేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు.
మృతి చెందిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తోన్న శాఫ్ మాజీ ఛైర్మన్