రష్యాకు చెందిన తల్లీకుమార్తెలు ఒలివీయా, ఎస్తర్.. భారతదేశంలోని వివిధ ఇస్కాన్ ఆలయాలను సందర్శించి.. తమకు తెలిసిన వెన్నెముక వైద్యం ద్వారా భక్తులకు సేవ చేసుకునే సంకల్పంతో ఫిబ్రవరి 6న దేశానికి వచ్చారు. లాక్‌డౌన్ విధించాక... పశ్చిమబంగాల్‌లో ఉన్నారు. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమవటంతో... శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. విదేశీయులకు ప్రస్తుతం దర్శనభాగ్యం లేకపోవటంతో చేతిలో ఉన్న డబ్బులతో తిరుపతిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉత్తరభారతంలోని బృందావనానికి రష్యా దేశస్థులు ఎక్కువ వస్తారంటూ... వారి సాయం కోసం తల్లి ఒలివీయా అక్కడికి వెళ్లింది. అక్కడా వారికి నిరాశే ఎదురైంది. తిరిగి తిరుపతి రాలేక ఆమె అక్కడే ఇరుక్కుపోయారు. దేశం కాని దేశంలో తల్లీకుమార్తెలు వేల కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయారు.
తిరుపతిలో రష్యన్ మహిళ కష్టాలు.. ఆర్థిక సమస్యలతో తల్లీకుమార్తెలు అవస్థ
ఆధ్యాత్మిక యాత్రకని వచ్చారు. ఈ కష్టకాలంలో వారిని ఆదుకునే దేవుడే కనపడక దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్నారు. స్వదేశానికి వెళ్లాలనే ప్రయత్నాల్లో...... తల్లీకుమార్తెలు వేల కిలోమీటర్ల దూరంలో వేర్వేరు చోట్ల ఇరుక్కుపోయారు. చేతిలో డబ్బులు నిండుకున్నాయి. యాచనకు అభిమానం అడ్డొస్తోంది. ఫిజియోథెరపీ, అలంకరణ తెలిసిన తనకు.... అందులో ఉపాధి చూపిస్తే డబ్బు సంపాదించుకుని వెళ్లిపోతానంటోంది ఆ రష్యా యువతి.
Russian lady
చేతిలో కేవలం వెయ్యి రూపాయలు మిగిలి.. ఇబ్బంది పడుతున్న ఆమెకు... కపిలతీర్థం వద్ద ఓ వసతిగృహ నిర్వాహకుడు ఆశ్రయమిచ్చారు. తనకు ఫిజియోథెరపీ, చిత్రలేఖనం, అలంకరణలో ప్రావీణ్యం ఉందని... అందుకు తగిన పని కల్పిస్తే.. డబ్బులు సంపాదించుకుంటానని ఆమె వేడుకుంటోంది. కరోనా భయం, భాష సమస్యతో తనను ఎవరూ నమ్మట్లేదని.. దయచేసి ఆదుకోవాలని ఎస్తర్ కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఇదీ చదవండి:మెుదటి రాత్రే అనారోగ్యమన్నాడు.. తర్వాత ఇలా చెప్పాడు..!
Last Updated : Jul 28, 2020, 6:05 PM IST