లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తాం: కలెక్టర్ - ap lockdown news
చిత్తూరు జిల్లాలో శుక్రవారం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని... గురువారం రోజు 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ప్రకటించారు. శ్రీకాళహస్తిలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండగా... లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.
చిత్తూరు జిల్లాలో శుక్రవారం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని... కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 300 నమూనాల ఫలితాలు వచ్చాయని... అన్నీ నెగిటివ్ అని వివరించారు. మరో 1546 మందికి సంబంధించిన నమూనాల ఫలితాలు రావల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. మొత్తం 16 హాట్ స్పాట్లు గుర్తించామని... గ్రామీణ ప్రాంతాల్లో 12, పట్టణ ప్రాంతాల్లో 4 ఉన్నాయన్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిలో ర్యాండమ్‌గా, రెడ్‌జోన్ పరిధిలో పాజిటివ్ కేసులు వచ్చిన వారిపై ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్‌ల నుంచి నమూనాలు సేకరిస్తున్నట్టు వివరించారు.