రేణిగుంటలో ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య - శ్రీకాకుళం ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
09:11 August 08
ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న సాయంత్రం నుంచి విధులు నిర్వహిస్తున్న ఆనందరావు ఈ రోజు ఉదయం.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం సొంతూరు శ్రీకాకుళం వెళ్లి వచ్చిన అతడు.. వ్యక్తిగత సమస్యలతో పాటు విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరణానికి గల కారణాలను వారు అన్వేషిస్తున్నారు.
ఇదీ చదవండి:CHANDRABABU: అణచివేయాలని చూస్తే.. మరింత ఉద్యమిస్తాం