ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి - news updaetes in chitthore district

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా క్షీరసముద్రంలో జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

rtc driver death in a road accident at ksheerasamudram chitthore district
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి

By

Published : Jan 11, 2021, 1:45 AM IST

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలోని క్షీరసముద్రం గ్రామానికి చెందిన వాసుదేవనాయుడు... పుత్తూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం పుల్లూరు వెళ్లి క్షీరసముద్రం గ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వాసుదేవనాయుడు తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా క్షతగాత్రుడిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో శ్రీరంగరాజపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details