లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లాక్డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినందున ఆర్టీసీలో కార్గో సేవలను పునరుద్ధరించారు. తద్వారా ఔషధాలు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతరత్రా సరకుల రవాణా చేయాలని అధికారులు నిర్ణయించారు. తిరుపతి ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 14 డిపోల్లో కార్గో సేవలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రైతులు.. తమ పంటలను విపణి చేసుకునేందుకు వీలుగా రవాణా సదుపాయాలను అందించనున్నట్లు తిరుపతి ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం మధు అన్నారు.
తిరుపతి రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్గో సేవలు
లాక్డౌన్ నిబంధనతో రాష్ట్రంలో ఆర్టీసీ సేవలు స్తంభించాయి. ఫలితంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరుపతి ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్గో సేవలు అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఔషధాలు, ఆహార ఉత్పత్తులు రవాణా చేయాలని నిర్ణయించారు.
తిరుపతి రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్గో సేవలు