ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తూరు జిల్లాలో రోడ్లపైకి బస్సులు

By

Published : May 21, 2020, 4:39 PM IST

దాదాపు 2 నెలల సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత చిత్తూరు జిల్లాలో బస్సులు రోడ్డెక్కాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణికులు బస్సులు ఎక్కారు. ప్రయాణికులకు గ్రౌండ్ బుకింగ్ పాయింట్లు, రిజర్వేషన్ పాయింట్ల ద్వారా టికెట్లు ఇచ్చారు.

rtc-buses-on-roads-in-chittore-district
చిత్తూరు జిల్లాలో రోడ్లపైకి బస్సులు

దాదాపు 2 నెలల లాక్ డౌన్ తర్వాత చిత్తూరు జిల్లాలో పరిమిత సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 22 మార్గాలలో ఆర్టీసీ 191 బస్సులను నడుపుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే సర్వీసులన్నీ ప్రారంభయయ్యాయి. శానిటైజర్లతో చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటిస్తూ.. ప్రయాణికులు బస్సులు ఎక్కారు. అయితే జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు బస్సులను నడపడం లేదు. 60 గ్రౌండ్ బుకింగ్ పాయింట్లు, 7 రిజర్వేషన్ పాయింట్లు ద్వారా ఆర్టీసీ టికెట్ల కొనుగోలు సౌకర్యం కల్పించింది.

ABOUT THE AUTHOR

...view details