RTC bus overturned: చిత్తూరు జిల్లా కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15మంది గాయపడ్డారు. తమిళనాడులోని తిరుపత్తూరు నుంచి 35మంది ప్రయాణికులతో కుప్పం బయలుదేరిన బస్సు.. చందం గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. స్థానికులు వెంటనే బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీసి, గాయపడిన వారిని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పినట్లు డ్రైవర్ తెలిపాడు. ఇదిలావుంటే బస్సు కండిషన్‌లో లేకపోవటమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. కండిషన్ లేకపోవడమే కారణమంటున్న ప్రయాణికులు - చిత్తూరు జిల్లా
RTC bus overturned: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అనేవి కేవలం మాటలకే పరిమితం అవుతున్నట్టు ఉన్నాయి. తాజాగా కండిషన్‌లో లేని బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
![చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. కండిషన్ లేకపోవడమే కారణమంటున్న ప్రయాణికులు RTC bus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17212786-19-17212786-1671094292678.jpg)
ఆర్టీసీ బస్సు
కండీషన్ సరిగా లేని ఆర్టీసీ బస్సు బోల్తా