ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOMATO PRICE: రూ.130 పలికిన కిలో టమోటా ధర.. మదనపల్లె మార్కెట్​లో రికార్డు - madanapalle market latest news

టమోటా ధర రోజురోజుకు(Rs 130 for kg tomato in madanapalle market) పెరిగిపోతోంది. వారం రోజుల క్రితం సెంచరీ మార్క్‌కు చేరిన టమోటా ధర... ఇపుడు రూ. 130కి చేరింది. ఆసియాలో అతిపెద్ద టమోటా మార్కెట్‌గా గుర్తింపు పొందిన మదనపల్లె మార్కెట్‌ యార్డులో గతంలో ఎన్నడూ లేని రీతిలో టమోటా ధర పలికింది. చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించి రైతుల నుంచి వ్యాపారులు టమోటా కొనుగోలు చేశారు.

rs 130 for kg tomato in madanapalle market
రూ.130కి చేరిన కిలో టమోటా ధర

By

Published : Nov 24, 2021, 4:39 AM IST

kg tomato Rs 130 in madanapalle market: ఆసియాలో అతిపెద్ద టమోటా మార్కెట్‌గా గుర్తింపు పొందిన మదనపల్లె మార్కెట్‌ యార్డులో గతంలో ఎన్నడూ లేని రీతిలో టమోటా ధర పలికింది. వారం రోజుల క్రితం సెంచరీ మార్క్‌ చేరిన కిలో టమోటా ధర... ఇప్పుడు 130 రూపాయలకు చేరింది. గరిష్ఠంగా రోజుకు వెయ్యి మెట్రిక్‌ టన్నులతో కళకళలాడే మదనపల్లె మార్కెట్‌ యార్డు.. కేవలం 150 మెట్రిక్‌ టన్నులకు పరిమితమవ్వగా.... చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించిన వ్యాపారులు టమోటా కొనుగోలు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతినడంతో టమోటా ధరలు(hike tomato price) ఆకాశాన్నంటుతున్నట్లు మార్కెట్ యార్డ్ సిబ్బంది తెలిపారు.

రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో టమోటా పంట సాగుచేస్తుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం చిత్తూరు జిల్లాలో పండిన టమోటా ఎగుమతి అవుతుంది. గడచిన కొంత కాలంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టమోటా పంట పూర్తిగా దెబ్బతినింది. మరో వైపు ఖరీఫ్‌ సీజన్‌ ముగింపు...రబీ సీజన్‌ ప్రారంభ దశ కావడంతో దిగుబడులు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఫలితంగా గతంలో రోజుకు 800 వందల నుంచి వెయ్యి మెట్రిక్‌ టన్నుల మేర మదనపల్లె మార్కెట్‌(tomato price at madanapalle market yard)కు వచ్చిన టమోటా ఇపుడు 150 టన్నులకు పడిపోయింది. పరిమిత సంఖ్యలో వస్తున్న టమోటా దక్కించుకోవడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. దీంతో చరిత్రలో మునుపెన్నడు లేని రీతిలో 28 కిలోల బాక్స్‌ 3640 పలికిందని మదనపల్లి మార్కెట్ యార్డ్ కార్యదర్శి అక్బర్ బాషా వెల్లడించారు.

గతంలో రాష్ట్ర అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయిలో టమోటా పంటను అందించిన మదనపల్లె మార్కెట్‌.. ఇపుడు స్థానిక అవసరాలకు సరిపడక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. స్థానిక వ్యాపారులు తమ వినియోగదారులకు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం రాయపూర్‌ నుంచి దాదాపు 20 మెట్రిక్‌ టన్నులు రోజు దిగుమతి చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి..

Krishna river dispute: కృష్ణా జలాల పంపిణీపై క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details