Robbery in Tirupati: తిరుపతిలో భారీ చోరీ - Robbery
15:03 September 23
రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం అపహరణ
తిరుపతి నగరంలోని రాయల్నగర్లో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగి గోపాల్ ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు రూ.11 లక్షల నగదుతో పాటు 400 గ్రాముల బంగారం అపహరించారు. ఎస్వీ విశ్వవిద్యాలయంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన గోపాల్.. భార్యతో కలిసి రాయల్ నగర్లో నివాసముంటున్నారు. గోపాల్ భార్య పద్మావతి ప్రధాన ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సుమారు 11 లక్షల రూపాయలను గృహనిర్మాణం కోసం తీసుకొచ్చారు. రాత్రి ఇంటిలో పెట్టుకున్న సమయంలో దొంగలు పడి 11 లక్షల నగదుతో పాటు బంగారాన్ని దోచుకెళ్లారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న గోపాల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన వెంట భార్య పద్మావతి ఆసుపత్రికి వెళ్లిన సమయంలో దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:ఉద్యోగం రాకపోవడంతో.. ఆ విధంగా డబ్బు సంపాదించాలని...!