ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రి ఆలోచన అదిరింది..పిల్లల కోరిక నెరవేరింది - room on tree updates

ఉమ్మడి కుటుంబం.. ఇరుకైన ఇల్లు.. ఐదుగురు పిల్లలు.. ఇదీ ఓ చిరుద్యోగి జీవితం. పిల్లల చదువు కోసం ప్రశాంతమైన గదిని నిర్మించాలని అనుకున్నాడు. సొంత స్థలం లేక ఆలోచనలో పడ్డాడు. రోడ్డు పక్కనే ఉన్న చింతచెట్టు.. తమ చింత తీరేందుకు ఓ మార్గం చూపించింది. ఆ చెట్టు పైనే గదిని నిర్మించి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకీ ఆ గది ఎక్కడ ఉంది.. చెట్టుపై గదిని ఎలా నిర్మించారో తెలుసుకోవాలంటే.. చిత్తూరు జిల్లా నరసింగాపురానికి వెళ్లాల్సిందే.

room construct on tree
చింతచెట్టుపై గది

By

Published : Mar 3, 2021, 2:13 PM IST

Updated : Mar 3, 2021, 5:21 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన శివశంకర్‌, సురేష్‌ అన్నదమ్ములు. వీరిది ఉమ్మడి కుటుంంబం.. చిన్నపాటి సిమెంటు రేకుల ఇంట్లో ఉంటున్నారు. అన్నదమ్ములకు అయిదుగురు పిల్లలు ఉన్నారు. అసలే ఇల్లు ఇరుకుగా ఉండటంతో.. పిల్లలు చదువుకోవటానికి ఇబ్బంది పడుతుండటాన్ని శివ శంకర్ గమనించాడు. పిల్లల చదువు కోసం ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించాలనుకున్నాడు. సొంత స్థలం లేకపోవటంతో వినూత్నంగా ఆలోచించి.. ఇంటికి ఎదురుగా ఉన్న పెద్ద చింతచెట్టుపైనే గదిని నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. ఇనుప చువ్వలు, ప్లైవుడ్​లతో చిన్నపాటి గదిని ఏర్పాటు చేసి.. ఎండకు, వానకు ఇబ్బంది కలగకుండా, టార్పాన్​ను ఏర్పాటు చేశారు. అందులో రెండు ట్యూబ్‌లైట్లు, ఒక ఫ్యాన్‌ ఏర్పాటు చేశారు. చెట్టుపైకి కోతులు ఎక్కువగా వస్తుండటంతో.. పులి బొమ్మను ఉంచారు.

చింతచెట్టుపై గది

ఇప్పుడు తమ పిల్లలు ప్రశాంతంగా చదువుకోగలుగుతున్నారని ఆ తండ్రి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తమ చదువుకోసం తమ తండ్రి గదిని నిర్మించాడని.. శివ శంకర్ కుమార్తె ఆనందం వ్యక్తం చేస్తోంది.

మనకు అన్ని విధాలా మేలు చేస్తున్న వృక్షాలు చాలానే ఉన్నాయి. మనకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, నిలువ నీడను ఇస్తున్న చెట్లను కాపాడుకోవటం మన బాధ్యత. నిన్నటి మన నిర్లక్ష్యాన్ని వదిలేసి నేటినుంచే పచ్చని భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం.

ఇదీ చదవండి:మరోసారి అవకాశమిచ్చినా అరకొర స్పందన

Last Updated : Mar 3, 2021, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details