తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ శివార్లలో జరిగిన పుశువైద్యురాలి హత్య... తనను ఎంతగానో కలచివేసిందని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా పేర్కొన్నారు. యువతిపై అత్యాచారానికి పాల్పడి... హత్యచేయడం హేయమైన చర్యని అభిప్రాయపడ్డారు. వారిని ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. యువతి తల్లిదండ్రులు తమ బిడ్డ కనపడలేదని పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వస్తే... వారిపట్ల అవహేళనగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.
'నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి' - నిందితులను శిక్షించాలన్న రోజా
హైదరాబాద్లో యువ వైద్యురాలిని హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని... ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా డిమాండ్ చేశారు. ఆడపిల్లలపై ఇలాంటి అమానవీయ ఘటనలు జరగటం... వారి ఎదుగుదలకు అడ్డుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు.
నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి'