చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకులో మంగళవారం అర్ధరాత్రి కొందరు దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుక భాగంలో కన్నం పెట్టి లోనికి ప్రవేశించారు. దుండగులు బ్యాంకులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లారు. ఈ విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు.
బ్యాంకు చోరీకి విఫలయత్నం - కొలమాసనపల్లి బ్యాంకులో చోరీ
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకులో దుండగులు చోరీకి యత్నించారు. స్థానికుల సమాచారం మేకరు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోలీసులను చూసి దుండగులు పారిపోయారు.
పోలీసులను చూసి దుండగులు పరారయ్యారు. బ్యాంకులో సొమ్ము ఏమైనా పోయిందా లేదా అని పోలీసులు, బ్యాంకు సిబ్బంది పరిశీలిస్తున్నారు. బ్యాంకు వెనుక భాగంలో పొలాలు ఉండడంతో దుండగులు అక్కడి నుంచి లోనికి ప్రవేశించారని... ఇలా జరగడం ఇది మూడవసారని, గతంలో రెండు సార్లు ఇలాగే చోరీకి విఫలయత్నాలు జరిగిందని పలమనేరు ఎస్సై నాగరాజు చెప్పారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహకారంతో దుండగులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: చీరాల: ఆమంచి, కరణం వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వివాదం