వరుస తుపానులు, భారీ వర్షాలతో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. తిరుపతి నుంచి పుంగనూరుకు వెళ్లే దారి కల్వర్టు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఈ రహదారి చంద్రగిరి, పాకాల, పులిచెర్ల మండలాలను కలుపుతూ 40 గ్రామాల ప్రజలు తిరుపతి నగరానికి వచ్చేందుకు వీలుగా ఉండేది. తుపాను తాకిడికి దారి పూర్తిగా దెబ్బతినటంతో ఉద్యోగులకు, ఆయా గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.
ఏ రంగంపేట నుంచి పాకాల మండలం పుదిపట్ల బయిల్ అడవి మార్గంలో పుంగనూరుకు ఏర్పాటు చేసిన రహదారి పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ మార్గంలో ఉన్న ఏడు వంతెనల్లో మూడు వంతెనలు పూర్తిగా కుప్పకూలగా, మిగిలిన చోట్ల అధ్వాన్నంగా తయారయ్యాయి.