చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి వద్ద అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఇంటిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో యువకుడికి తీవ్రగాయాలు కాగా..ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతులు కుప్పం వాసులుగా గుర్తించారు.
రోడ్డు పక్కన ఇంటిని ఢీకొన్న కారు.. ఇద్దరు యువకులు మృతి - రోడ్డు పక్కన ఇంటిని ఢీకొన్న కారు వార్తలు
రహదారి పక్కన ఉన్న ఇంటి కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా కడపల్లి వద్ద అర్థరాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. గాయపడ్డ మరో యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
![రోడ్డు పక్కన ఇంటిని ఢీకొన్న కారు.. ఇద్దరు యువకులు మృతి రోడ్డు పక్కన ఇంటిని ఢీకొన్న కారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15979227-204-15979227-1659314285393.jpg)
రోడ్డు పక్కన ఇంటిని ఢీకొన్న కారు