ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం... పది మందికి గాయాలు - bus

బస్సు, కంటైనర్ లారీ ఢీకొని పది మంది గాయపడ్డారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదం

By

Published : Sep 10, 2019, 6:35 AM IST

కంటైనర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీ

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, హర్యానాకు చెందిన కంటైనర్ లారీ చంద్రగిరి మండలం తొండవాడ బైపాస్ వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ, బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లును పోలీసులు జేసీబీ, క్రేన్ సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details