తిరుమలలో అదుపు తప్పిన కారు.. పలువురికి గాయాలు... - తిరుమలలో రోడ్డు ప్రమాదం న్యూస్
తిరుమల కనుమ దారిలో కారు అదుపు తప్పడంతో పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
తిరుమల కనుమ దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. స్వామివారి సేవల అనంతరం కారులో తిరుగు ప్రయాణమవుతుండగా.. మొదటి కనుమలోని 32వ మలుపు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో రెండు చెట్ల మధ్యలో ఇరుకున్న కారు నుజ్జు నుజ్జు అయింది. ఆ సమయంలో ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో బాధితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి అధికారులు తరలించారు.