చిత్తూరు జిల్లా పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. పీలేరు-కలకడ రహదారిలో మహల్ క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కడప జిల్లా రాయచోటి, కొత్తపల్లెకు చెందిన అహ్మద్ ఫరీద్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఆర్టీసీ బస్సు, కారు ఢీ... నలుగురు మృతి - road accidents in nelore
చిత్తూరు జిల్లా పీలేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-కలకడ రహదారిలో మహల్ క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.

పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Last Updated : Dec 27, 2019, 7:37 AM IST