చిత్తూరు జిల్లా కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లి కస్పా వద్ద కడప - చిత్తూరు జాతీయ రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్నిఢీకొట్టటంతో భార్యాభర్తలు, మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శంకరయ్య (35), రెడ్డమ్మ (30) దంపతులు చిన్నగొట్టిగల్లు గ్రామం వద్ద బండ రాళ్లు కొట్టే కార్మికులుగా పని చేస్తున్నారు. వీరు కడప జిల్లా సంబేపల్లి వద్ద బండరాళ్లు కొట్టేందుకు ద్విచక్ర వాహనంపై తమ మూడేళ్ల కుమారునితో కలిసి వెళ్తుండగా మార్గంమధ్యలో గ్యారంపల్లి కస్పా వద్ద వెనకనుంచి వచ్చిన లారీ వాహనాన్ని ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న కంభంవారిపల్లె పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ..ముగ్గురు మృతి - taja news of chittoor dst
లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టటంతో మూడేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లి కస్పా వద్ద కడప - చిత్తూరు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

road accident in chittoor dst three died