ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైరెడ్డిపల్లిలో ఆటో, ట్రాక్టర్ ఢీ... ఒకరు మృతి - road accident news in baireddypalli

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ముందుగా వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆటో, ట్రాక్టర్ ఢీ... ఒకరు మృతి
ఆటో, ట్రాక్టర్ ఢీ... ఒకరు మృతి

By

Published : Jun 19, 2020, 5:06 PM IST

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోని ట్రాక్టర్ ఢీకొట్టగా ఓ మహిళ మృతిచెందింది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పాతపేట గ్రామం వద్ద ముందుగా వెళ్తున్న ఆటోను ట్రాక్టర్​ ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని ఆరుగురికి తీవ్ర గాయాలవగా ఓ మహిళ మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు వెంగమవారిపల్లి, కడపనత్తంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి:నాటు బండ్లను ఢీకొట్టిన లారీ.. రెండు ఎడ్లు మృతి

ABOUT THE AUTHOR

...view details