chinna gottigallu accident: చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. భాకరాపేట కనుమదారిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేశ్ అనే వ్యక్తిని... గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
accident: తిరుపతి- అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి - చిత్తూరు జిల్లాలో ముఖ్య వార్తలు
చిత్తూరు జిల్లా చిన్న గొట్టిగల్లులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న భాకరాపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. మృతుడు వెంకటేష్ భవన నిర్మాణ కూలీ అని... సెంట్రింగ్ పనుల నిమిత్తం భాకరాపేటకు వస్తూ ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని పోలీసులు అన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:visaka accident: జాతీయ రహదారిపై ప్రమాదం...సీఐ ఈశ్వరరావు మృతి