చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్య గారి పల్లి తిరుపతి- అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజా అనే వ్యక్తి మృతి చెందాడు.
కొట్టాల గ్రామం నుంచి రాజా అనే వ్యక్తి తిరుపతికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.