చిత్తూరు జిల్లాలో బైకును ఢీ కొన్న లారీ.. రెండు వాహనాలు దగ్ధం.. ఇద్దరు మృతి - బైకును ఢీ కొన్న లారీ
23:00 May 24
మంటలు అంటుకుని బైకు, లారీ దగ్ధం
చిత్తూరు జిల్లా నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో ద్విచక్రవాహనాన్ని లారీ రెండు కిలోమీటర్ల వరకు లాక్కెళ్లింది. దీంతో మంటలు చేలరేగి లారీ, బైక్ దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా.. ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లారీలో మంటలు చేలరేగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు.
నగరి పట్టణం ఏకాంబరకుప్పంకు చెందిన కేఆర్ పవిత్రన్(17), మరో యువకుడు ద్విచక్రవాహనంలో పుత్తూరుకు బయలుదేరారు. నగరి హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగనే వెనక నుంచి అతివేగంగా వచ్చిన పంజాబ్ రిజిస్ట్రేషన్ లారీ.. వీరి ద్విచక్రవాహనాన్ని ఢీ కట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరొకరి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:సిలిండర్ పేలి ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు