చౌడేపల్లి వద్ద ట్రాక్టర్ స్కూటర్ ఢీ... ఒకరు మృతి - road accident at choudepalli news updates
చిత్తూరు జిల్లా తిరుపతిలోని చౌడేపల్లి వద్ద స్కూటర్‌ను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందగా... స్కూటర్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ అతివేగంతో ఉన్న కారణంగా.. అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న బావిలో పడింది. మృతదేహాన్ని జేసీబీలను ఉపయోగించి బయటకు తీయించారు. చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.