కళాశాలకు బయలుదేరిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో కానరాని లోకానికి చేరాడు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం తిరుమల నగర్‌కు చెందిన లీలా వెంకట శ్రీనివాస్ కుమారుడు ఎం.క్రిష్ణ దిలీప్.. రంగంపేట సమీపంలోని శ్రీ విద్యానికేతన్‌లో విద్యార్థి. తిరుపతి నగరంలో స్నేహితులతో కలిసి గదిలో అద్దెకు ఉంటూ.. బీటెక్ మూడో సంవత్సరం విద్యను అభ్యసించాడు. ద్విచక్రవాహనంపై కళాశాలకు బయలుదేరాడు. శ్రీనివాస్ మంగాపురం వద్ద ఉన్న నారాయణ కళాశాల సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి.. అదుపుతప్పి వేగంగా చెట్టును ఢీ కొన్నాడు. తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108 సహకరాంతో తిరుపతి రుయాకు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
కళాశాలకు వెళ్తూ.. కానరాని లోకానికి..! - చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు
రోజువారీగా కళాశాలకు బయలుదేరిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో కానరాని లోకానికి చేరాడు. అతడిని కర్నూలు జిల్లా ఆదోని పట్టణం తిరుమల నగర్‌కు చెందిన ఎం.క్రిష్ణ దిలీప్‌గా పోలీసులు గుర్తించారు.
కళాశాలకు వెళ్తూ.. కానరాని లోకానికి..!