చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కడప క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మోడల్ స్కూల్ సమీపంలో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఘటనలో.. గుర్రంకొండ మండలం సంఘ సముద్రానికి చెందిన రామ్ కుమార్ (25), పవన్ కుమార్ రెడ్డి (25 ) అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు.
మృతులు బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. ఉదయాన్నే ద్విచక్ర వాహనంలో బెంగళూరుకు వెళ్తుండగా.. కనిగిరి వైపు వస్తున్న కారు.. వారి ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఘటనలో చనిపోయిన రామ్, పవన్ మృతదేహాలను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.