ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ- ఒకరు మృతి - ఒకరు మృతి
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. లారీ డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సి.మల్లవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.నెల్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని బోడెవాండ్లపల్లికి రైతులు ట్రాక్టర్‌లో గడ్డిగా తీసుకెళ్తుండగా....డీజిల్ అయిపోవటంతో మార్గమధ్యంలో ట్రాక్టర్‌ను రోడ్డుపైనే నిలిపివేశారు.ఇది గమనించని లారీ డ్రైవర్ వెనుక వైపు నుంచి ఢీ కొట్టటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.లారీ డ్రైవర్,క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.