చిత్తూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే తిరుపతి రుయా ఆసుపత్రిలో 7 బ్లాక్ ఫంగస్ కేసులను వైద్యులు నిర్ధారించారు. రుయాలో ఈ కేసుల సంఖ్య 15కి చేరాయి. స్విమ్స్ ఆసుపత్రిలో మరో 5 కేసులు నిర్ధారణ అయ్యాయి. రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు రుయా, స్విమ్స్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ బ్లాక్ ఫంగస్ కేసులు 18 ఉండగా... రుయా ఆసుపత్రిలో ఇద్దరు బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న రోగులు శుక్రవారం మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు - Black Fungus Latest update
చిత్తూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో 7 బ్లాక్ ఫంగస్ కేసులను వైద్యులు నిర్ధారించారు. రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు రుయా, స్విమ్స్ అధికారులు తెలిపారు.
![చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11860828-44-11860828-1621695260168.jpg)
చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు