రైస్ పుల్లింగ్, దొంగతనాలు, ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురిని తిరుపతి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ మోసాలకు పాల్పడుతున్న వారిలో ఇద్దరు ఐఐటీ ఫౌండేషన్ సంస్థల్లో చెప్పే లెక్చరర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. ప్రజలు రైస్ పుల్లింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతర దొంగతనాల కేసుల్లో ముగ్గురి వద్ద నుంచి 223 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ... మొత్తం 4 కేసుల్లోనూ కలిపి రూ.49 లక్షల రూపాయలు, విలువైన నగదును, బంగారాన్ని రికవరీ చేసినట్లు వివరించారు.
రైస్ పుల్లింగ్ పేరుతో మోసం.. ఐదుగురి అరెస్టు
తిరుపతిలో రైస్ పుల్లింగ్, దొంగతనాలు, మోసాలు చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు లెక్చరర్లు ఉన్నారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ.49 లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
రైస్ పుల్లింగ్ మోసాల్లో ఇద్దరు లెక్టరర్లు అరెస్ట్
TAGGED:
rice pulling latest news