ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకుంఠ ఏకాదశి.. తిరుమల శ్రీవారి సర్వదర్శన ఏర్పాట్లు పరిశీలన - మ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శ్రీవారి సర్వదర్శన ఏర్పాట్లు పరిశీలన

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి సర్వదర్శన వివరాలను అధికారులు తెలిపారు. ఈ నెల 24 ఉదయం నుంచి టోకెన్లను ఇవ్వనున్నట్లు వివరించారు. రోజుకు ఎనిమిది వేల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. జనవరి 3వరకు శ్రీవారి సర్వదర్శనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Srivari Sarvadarshana arrangements
శ్రీవారి సర్వదర్శన ఏర్పాట్లు పరిశీలన

By

Published : Dec 19, 2020, 3:18 PM IST

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కేంద్రాలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎస్పీ రమేష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పరిశీలించారు. ఈ నెల 24 ఉదయం నుంచి టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. జనవరి 3వరకు శ్రీవారి సర్వదర్శనం కొనసాగుతుందని వివరించారు. కరోనా నిబంధనలను అనుసరించి రోజుకు ఎనిమిది వేల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఈ సదుపాయాన్ని కేవలం స్థానికులకు మాత్రమే పరిమితం చేసినట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details