వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని.. శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా తోరణాలతో ముస్తాబైంది. స్వామి వారి కళ్యాణ మండపాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. కరోనా కారణంగా భక్తుల తాకిడి చాలా తక్కువగా కనిపిస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుటుంబసమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మాడ వీధుల్లో ఈవో కార్యాలయం నుంచి పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు.
రూ.10కోట్లతో ఆలయ అభివృద్ధి: మంత్రి వెల్లంపల్లి