శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల నుంచి ఇతర రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సు సేవలను అందిస్తున్నట్లు తిరుమల డిపో మేనేజర్ ఎంవీఆర్ రెడ్డి ప్రకటించారు. కరోనా కారణంగా తిరుమల నుంచి ఇతర ప్రాంతాలకు బస్సు సేవలను నిలిపివేసిన ఆర్టీసీ.. యాత్రికుల సౌకర్యార్థం తిరిగి సర్వీసులను ప్రారంభించనున్నారు.
తిరుమల నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు పునఃప్రారంభం - తిరుపతి
తిరుమల నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సు సేవల్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తిరుమల డిపో మేనేజర్ ఎంవీఆర్ రెడ్డి ప్రకటించారు. కరోనా కారణంగా తిరుమల నుంచి ఇతర ప్రాంతాలకు ఇది వరకు బస్సు సర్వీసులను నిలిపివేశారు.

తిరుమల బస్సు సర్వీసులు
తిరుమల నుండి చెన్నై, వేలూరు, హొసూరు, రేణిగుంట విమానాశ్రయానికి ప్రతి 30 నిమిషాలకు బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల నుంచి ఆర్టీసీ సర్వీసుల ద్వారా తిరుమలకు నేరుగా చేరుకునే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి:TIRUMALA: శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం