ఆంధ్రప్రదేశ్

andhra pradesh

క్షణాల్లో స్పందించారు... 35మందిని కాపాడారు

By

Published : Nov 26, 2020, 11:16 PM IST

నివర్ తుపాను బీభీత్సంతో చిత్తూరు జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణాలు వరద నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో చిత్తూరులోని చెన్నారెడ్డి కాలనీని ఒక్కసారిగా వరద చుట్టముట్టింది. విషయం తెలుసుకున్న వెంటనే చిరుత వేగంతో సహాయక సిబ్బంది కాలనీవాసులను కాపాడారు.

chittor
chittor

క్షణాల్లో స్పందించారు... 35మందిని కాపాడారు

చిత్తూరు ఓవర్ బ్రిడ్జి సమీపంలోని చెన్నారెడ్డి కాలనీని గురువారం ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. గంగినేని చెరువు ఉప్పొంగటంతో కాలనీవాసులు వరదలో చిక్కుకుపోయారు. నడుములోతు వరద నీటిలో సబ్ రిజిస్ట్రార్ సహా 34 మంది స్థానికులు చిక్కుకుపోయారు. బాధితులు సమాచారం ఇవ్వటంతో చిత్తూరు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలు శ్రమించి కాలనీ వాసులతో పాటు ముంపు ప్రాంతాల్లో ఉన్న మరికొంత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించిన చిత్తూరు పోలీసులను డీజీ‌పీ గౌతం సవాంగ్‌ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details