ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cattle Festival: పశువుల పండగపై ఆంక్షలు.. ప్రజల ఆగ్రహం - చిత్తూరు జిల్లాలో పశువుల పండుగ

FESTIVAL: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో సంక్రాంతి చివరి రోజున పశువుల పండగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కానీ దానిపై అధికారులు ఆంక్షలు విధించడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పశువుల పండుగను జరిపి తీరుతామని వారు అంటున్నారు.

pasuvula panduga in chittoor district
pasuvula panduga in chittoor district

By

Published : Jan 6, 2022, 10:24 PM IST

పశువుల పండగ జల్లికట్టు కాదంటున్న గ్రామస్థులు

FESTIVAL: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో.. ఏటా సంక్రాంతి చివరి రోజున జరిగే పశువుల పండగకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము జరుపుకునే పండగ జల్లికట్టు కాదని, పశువులను హింసించకుండా చేసుకునే పండగ అని స్పష్టం చేశారు. తరతరాలుగా తాము ఈ పండగ జరుపుకుంటున్నామని, అలాంటి పండగకు అడ్డు చెప్పడమేంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం పశువుల పండగ నిర్వహించకూడదని హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details