ఎట్టకేలకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండల పరిధిలోని ఏడు గిరిజన తండాలకు తారు రోడ్డు వసతి కలిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మారుమూల ప్రాంతాల్లో గిరిజన తండాల్లో మౌలిక వసతులు లేవు. 32 గిరిజన తండాల్లో గిరిపుత్రులు ఎదుర్కొంటున్న కష్టాలపై జూలై 7న ఈటీవీ భారత్ - ఈనాడులో వచ్చిన కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు.
అవికానాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఏడు గిరిజన తండాల తారు రోడ్డు నిర్మాణ పనులను మళ్లీ మొదలు పెట్టారు. మూడేళ్ల క్రితం ఈ పనులు చేపట్టి మధ్యలోనే ఆపేయగా.. ఇప్పుడు మాత్రం గత రెండు రోజులుగా ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు.