ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రెసిడెంట్ వైద్యులు ఆందోళన - తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రెసిడెంట్ వైద్యులు

ఉపకారవేతనాలు పెంచాలంటూ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రెసిడెంట్ వైద్యులు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలతో ఆందోళన చేసిన వైద్యులు.. గురువారం నుంచి నాన్-కొవిడ్ విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తమ అభ్యర్థనలను పట్టించుకోని పక్షంలో ఆందోళలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

resident doctors
రెసిడెంట్ వైద్యులు ఆందోళన

By

Published : Jun 16, 2021, 9:27 PM IST

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రెసిడెంట్ వైద్యులు ఆందోళనకు దిగారు. సుదీర్ఘ కాలంగా ఉపకారవేతనాలు పెంచాలంటూ ఆందోళన చేస్తున్నా.. తమ అభ్యర్థనను ప్రభుత్వం వినిపించుకోని కారణంగా ఆందోళనలను చేపట్టినట్లు రెసిడెంట్ వైద్యులు తెలిపారు. బుధవారం విధులు ముగిసిన తర్వాత నల్లబ్యాడ్జీలతో ఆందోళన చేసిన వైద్యులు.. గురువారం నుంచి నాన్-కొవిడ్ విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం తమ అభ్యర్థనలను పట్టించుకోని పక్షంలో ఆందోళలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details