చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఆకులవారిపల్లెలో.. నదిలో చిక్కుకున్న సీతారామయ్య కుటుంబాన్ని.. ఎస్టీఎఫ్, ఎంటీఆర్, పోలీసు సిబ్బంది ఎట్టకేలకు సురక్షితంగా తీరానికి చేర్చారు. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగా.. సాయంత్రానికి విజయం సాధించారు. బాధితుల్లో మూడు నాలుగేళ్ల చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారు. సీతారామయ్య కుటుంబం నది ఒడ్డున నివసిస్తోంది. నదీ ప్రవాహం ధాటికి వారి గుడిసె కొట్టుకుపోగా.. ఆ కుటుంబ సభ్యులు సహాయం కోసం వేచి చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆయా బలగాల సాయంతో ఎంతో శ్రమించి రక్షించారు. అందరూ సురక్షితంగా బయట పడటంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పీలేరు రెస్క్యూ ఆపరేషన్ సుఖాంతం - పీలేరు మండలంలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఆకులవారిపల్లెలో.. నదీ ప్రవాహంలో చిక్కుకున్న సీతారామయ్య కుటుంబాన్ని విపత్తు సహాయక దళాలు రక్షించాయి. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. సాయంత్రానికి సురక్షితంగా ఆరుగురుని ఒడ్డుకు చేర్చాయి.

బాధితులను కాపాడుతున్న సిబ్బంది