కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలుగా పాఠశాలలు మూతపడ్డాయి. లాక్ డౌన్ సడలింపులతో ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభానికి షరతులతో కూడిన అనుమతులిచ్చింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో 9,10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమయ్యయి.
తొమ్మిదో తరగతి విద్యార్థులకు రోజు విడిచి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజు తరగతులు జరగనున్నాయి. ప్రతి విద్యార్థి కచ్చితంగా మాస్క్ ధరించాలని, తరగతి గదిలో శానిటైజ్ చేయించాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కోవిడ్ నియమాలను పాటిస్తూ పాఠశాలల యాజమాన్యం చర్యలు తీసుకుంది. చంద్రగిరి మండలంలో ప్రైవేట్ పాఠశాలలు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు.