క్వారంటైన్ కేంద్రాలకు తిరుమల అతిథి గృహాల్లోని మంచాలు - chitoor district latest news
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో క్వారంటైన్ సెంటర్లలో మంచాల కొరత ఏర్పడింది. దీంతో తిరుమల అతిథి గృహల్లోని మంచాలను తిరుపతి క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.
తిరుపతి క్వారంటైన్ సెంటర్లకు 500 మంచాలు తరలింపు
తిరుమల అతిథి గృహల్లోని మంచాలను తిరుపతి క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. తిరుపతిలోని పద్మావతి, శ్రీనివాసం, విష్ణునివాసంలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో మంచాల కొరత ఏర్పడింది. రోగులకు సౌకర్యవంతంగా సేవలందించేందుకు తిరుమల కొండపై నుంచి 500 మంచాలు, పరుపు, దిండ్లును లారీల్లో తరలించారు.