ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

REGISTRATIONS ISSUE: కుప్పంలో లేఅవుట్ స్థలాలకు రిజిస్ట్రేషన్లు బంద్

REGISTRATIONS ISSUE: కుప్పం నియోజకవర్గంలో రెండున్నర నెలల నుంచి లేఅవుట్ స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు జరపడం లేదు. జిల్లా అధికారుల ఆదేశాల వల్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

కుప్పంలో లేఅవుట్ స్థలాలకు రిజిస్ట్రేషన్లు బంద్
కుప్పంలో లేఅవుట్ స్థలాలకు రిజిస్ట్రేషన్లు బంద్

By

Published : Dec 25, 2021, 1:17 PM IST


REGISTRATIONS ISSUE: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లేఅవుట్ స్థలాలకు రెండున్నర నెలల నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఈ ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు జరపడం లేదు. జిల్లా అధికారుల ఆదేశాల వల్ల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నా.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రిజిస్ట్రేషన్లు ఆపేశారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గంలో నాలుగు మండలాలతో పాటు కుప్పం మున్సిపాలిటి పరిధిలోని రూ. కోట్లలో పెట్టుబడి పెట్టివ వ్యాపారులు.. లేఅవుట్ స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగక తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు.

మరోవైపు రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సగానికి తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 14 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా.. నవంబర్ నెలాఖరు వరకు రూ. 4.80కోట్లు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

అటల్​ జీ సేవలు స్ఫూర్తిదాయకం: మోదీ

ABOUT THE AUTHOR

...view details