ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెయ్యి కిలోల ఎర్రచందనం దుంగలు పట్టివేత - చిత్తూరు జిల్లా నేర వార్తలు

చిత్తూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వెయ్యి కిలోల ఎర్రచందనం దుంగలను టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో వెయ్యి కిలోల ఎర్రచందనం దుంగలు పట్టివేత
చిత్తూరు జిల్లాలో వెయ్యి కిలోల ఎర్రచందనం దుంగలు పట్టివేత

By

Published : Sep 18, 2021, 10:34 PM IST

చిత్తూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వెయ్యి కిలోల ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట రహదారిలోని కరకంబాడీ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఎర్రచందనం దుంగలు మోసుకువెళ్తున్న స్మగ్లర్లు తారసపడ్డారు. పోలీసులను చూసి దుంగలు పడేసి పారిపోయేందుకు యత్నించిన స్మగ్లర్లను వెంబడించిన ప్రత్యేక కార్యదళ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు.

మరో వైపు హరిత కాలనీలో ఎర్రచందనం దుంగలను జీపులోకి లోడ్ చేస్తున్న స్మగ్లర్లు.. పోలీసులను చూసి వాహనం వదిలి పారిపోయారు. కారుతో పాటు 10 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం.. బావిలో శవమై

ABOUT THE AUTHOR

...view details