ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు పట్టివేత - ఎర్రచందనం సీజ్ వార్తలు

చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో తమిళ స్మగ్లర్లు దందా కొనసాగిస్తున్నారు. యర్రావారిపాళ్యం మండలంలోని శేషాచల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు.

redsandal seazed in tirupathi
శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు పట్టివేత

By

Published : Aug 11, 2020, 11:17 PM IST

చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో పోలీసులు, టాస్క్ ఫోర్స్, అటవీశాఖ అధికారులు నిరంతర కూంబింగ్ కొనసాగిస్తున్నప్పటికి ఎర్రచందనం అక్రమ రవాణా ఆగడంలేదు. యర్రావారిపాళ్యం మండలంలోని శేషాచల అటవీ ప్రాంతంలో తమిళ స్మగ్లర్ల కదలికలను సిబ్బంది మరోసారి గుర్తించారు.

తలకోన సమీపంలో సుమారు 28 మంది స్మగ్లర్లు అధికారులకు తారసపడ్డారు. దుంగలను వదలి దట్టమైన అడవిలోకి పరారయ్యారు. మొత్తం 26 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు, పరారైన స్మగ్లర్లకోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details