చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో స్మగ్మర్ల కదలికలు అలజడి సృష్టిస్తున్నాయి. యర్రావారిపాళ్యం మండలం తలకోన అటవీ ప్రాంతంలోని కాటుక కనుమ వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులకు తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారులను చూసిన స్మగ్లర్లు దుంగలను పడేసి దట్టమైన అడవిలోకి పారిపోయారు. అధికారులు 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. స్వాధీనపరచుకున్న దుంగలను భాకరాపేట అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
తలకోన అటవీ ప్రాంతంలో కూంబింగ్.. 19 దుంగలు స్వాధీనం - తలకోన అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల వార్తలు
చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలం తలకోన అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో అధికారులను గుర్తించిన స్మగ్లర్లు పారిపోగా... 19 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం స్వాధీనం