ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రచందనం అక్రమ రవాణా.. నిందితుల్లో వాలంటీర్?

ఎర్ర చందనం అక్రమ రవాణా నిందితుల్లో గ్రామ వాలంటీర్ ఉండడం చర్చనీయాంశం అయ్యింది. చిత్తూరు జిల్లా చెర్లోపల్లి - అలిపిరి మార్గంలో దుంగలు తరలిస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరైన నితీశ్ పుదిపట్ల... వాలంటీర్​గా పని చేస్తున్నట్లు గుర్తించారు.

red sandle illegal transport in tirupathi volunteer is a accused
ఎర్రచందనం అక్రమ రవాణా.

By

Published : Jul 29, 2020, 11:14 AM IST

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. చిత్తూరు జిల్లా తిరుపతి పరిసరాల్లోని చెర్లోపల్లి - అలిపిరి మార్గంలో కూంబింగ్ నిర్వహించిన టాస్క్​ఫోర్స్ పోలీసులు దుంగలు రవాణా చేస్తున్న ఆటోను పట్టుకున్నారు. 5 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల్లో ఒకడైన నితీశ్ చౌదరి పుదిపట్ల.. వాలంటీర్​గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పుదిపట్ల పంచాయతీ అధికారులు నితీశ్​ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మిగతా ఇద్దరూ సోమల మండలానికి చెందిన నాగరాజు, రవిగా తేల్చారు. వీరు శ్రీనివాసులురెడ్డి అనే ప్రధాన స్మగ్లర్ అనుచరులుగా పనిచేస్తున్నట్లు విచారణలో గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details