ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప, చిత్తూరు జిల్లాల్లో 62 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - కడప చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం స్వాధీనం

కడప, చిత్తూరు జిల్లాల్లో కూంబింగ్ నిర్వహించిన టాస్క్​ఫోర్స్ పోలీసులు 62 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులో 30, కడపలో 32 దుంగలను పట్టుకున్నారు. గత 3 రోజులుగా 4 టన్నుల ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

red sandle seized
ఎర్రచందనం స్వాధీనం

By

Published : Dec 14, 2020, 6:51 PM IST

చిత్తూరు, కడప జిల్లాలోని శేషాచల అడవులలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ చేపట్టింది. తిరుపతి సమీపంలోని ఎస్వీ జూ పార్క్ వద్ద కాపు కాచిన సిబ్బంది తమిళ స్మగ్లర్ల నుంచి 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్​ఫోర్స్ ఆర్​ఎస్ఐ. ఎం.వాసు ఆధ్వర్యంలో.. ఆదివారం శ్రీవారి మెట్టు, భాకరాపేట మార్గంలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీ చేస్తూ ఎస్వీ జూ పార్క్ వద్ద మాటు వేశారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కొంతమంది తమిళ స్మగ్లర్లు దుంగలను మోసుకువస్తూ కనిపించారు. పోలీస్ సిబ్బంది వారికి హెచ్చరికలు జారీ చేస్తూ చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. స్మగ్లర్లు దుంగలు పడేసి చీకట్లో పారిపోయారు. చుట్టుపక్కల గాలించగా 30 ఎర్రచందనం దుంగలు లభించాయి.

దీనిపై ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతూ.. గత వారం రోజులుగా తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని.. ఈ కారణంగా కూంబింగ్ చేశామని తెలిపారు. గత 3 రోజుల్లో 4 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

కడప జిల్లాలో 32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప జిల్లా రామాపురం వద్ద మరో 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆంజనేయులు తెలిపారు. రామాపురం పోలీసు స్టేషన్ సిబ్బందితో కలిసి సంయుక్త ఆపరేషన్​ చేసినట్లు తెలిపారు. దీనిపై పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇవీ చదవండి..

వాడరేవులో మరోసారి ఉద్రిక్తత.. కరణం, ఆమంచి వర్గీయుల ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details