భక్తులు కాదు... ఎర్రచందనం స్మగ్లర్లు... - Task Force Police Arrested Red Sandalwood Smugglers
భక్తుల ముసుగులో తిరుమలలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న దుండగులను పోలీసులు అరెస్టు చేశారు.
తిరుమల నుంచి కారులో ఎర్రచందనం దుంగలనుఅక్రమంగాతరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 13 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. బ్రహ్మోత్సవాలను అనుకూలంగా చేసుకొని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తున్నారు వీళ్లు. భక్తులులాగా కారులో ప్రయాణిస్తున్న దుండగుల సమాచారాన్ని ముందే తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అలిపిరి వద్ద అరెస్టు చేశారు. ఇటీవల ఇదే వాహనంలో తిరుమలకు 5 సార్లు వచ్చి ఎర్రచందనం రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు.